
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పదో తరగతి జవాబు పత్రాల కోడింగ్ ప్రక్రియ జాగ్రత్తగా చేపట్టాలని డీఈవో రమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలకు బుధవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన జవాబు పత్రాల బండిల్స్‌ను పరిశీలించారు. కోడింగ్, సహాయ కోడింగ్ అధికారులకు శిక్షణనిచ్చారు.
డీఈవో మాట్లాడుతూ.. మూల్యాంకనానికి ముందు ఈ నెల 27 నుంచి జరిపే కోడింగ్ ను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఏసీ రాజశేఖర్ రావు, చీఫ్ కోడింగ్ అధికారులు కురుమయ్య, యాదగిరి, సహాయ కోడింగ్ అధికారులు లత, నాగరాజు, కృష్ణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకటయ్య, పాండు పాల్గొన్నారు.